జ్యోతిర్లింగ
క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించగా,
శ్రీ మల్లికార్జునస్వామివారికి అన్నాభిషేకం నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయాన్ని
నిమ్మకాయలతో అలంకరించారు. అమ్మవారికి నవావరణ పూజ, త్రిశతి, అష్టోత్తర శతనామ
కుంకుమార్చనలు నిర్వహించారు. ఆ తర్వాత కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు అమ్మవారికి
సాత్విక బలిగా సమర్పించారు.
హరిహరరాయ
గోపురం వద్ద మహిషాసురమర్దిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కుంభోత్సవంలో
భాగంగా సాయంత్రం అన్నాన్ని రాశిగా పోసి అమ్మవారికి సమర్పించనున్నారు. సింహ మండపం
వద్ద ఈ క్రతువు నిర్వహించనున్నారు.
ప్రదోశకాల పూజలు అనంతరం మల్లికార్జునుడికి
అన్నాభిషేకం చేయనున్నారు. స్త్రీ వేషధారణలో ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి
సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. కుంభహారతి సమయంలో అమ్మవారికి పసుపు, కుంకుమ కూడా
సమర్పిస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటే అరిష్టాలు తొలిగి
శుభాలు చేకూరుతాయని నమ్మకం.
కుంభోత్సవం
సందర్భంగా అంకాళమ్మ, మహిషాసుర మర్దిని, చిన్న మస్తాదేవి, సుంకలమ్మ, పాతాళగంగ
మార్గంలోని వజ్రాల గంగమ్మ ఆలయాల వద్ద జంతు బలులు జరగకుండా పకడ్బందీ చర్యలు
తీసుకున్నారు. ప్రత్యేక సిబ్బందిని నియమించి జంతు, పక్షి బలుల నిషేధం గురించి
వివరించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు