విశాఖ ఉక్కు కర్మాగారం భూముల విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఏపీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఇతర ఆస్తులు, యంత్రాలు విక్రయించడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ బి.నరసింహశర్మ కోర్టుకు వివరించారు.ఉక్కు కర్మాగారంలో కేంద్రానికి ఉన్న వాటా మాత్రమే విక్రయిస్తున్నామని ఏఎస్జీ తెలిపారు. మరిన్ని వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కోరారు.అందుకు హైకోర్టు అంగీకరించింది. కేసు తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై గురువారం జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎన్.విజయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. జూన్ 19 వరకు స్టేటస్ కో కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.