Kakinada Rural Assembly Constituency Profile
కాకినాడ రూరల్ శాసనసభా నియోజకవర్గం 2008లో
ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి కాకినాడ అర్బన్ మండలంలోని
నాలుగు వార్డులు, కాకినాడ రూరల్ మండలం, కరప.
1955లో పల్లపాలెం ద్విసభ్య నియోజకవర్గం ఉండేది.
1962లో దాని స్థానంలో కరప, తాళ్ళరేవు నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. ఆ టెర్మ్ పూర్తయాక కరప నియోజకవర్గం
రద్దయి తాళ్ళరేవు మిగిలింది. 2004 వరకూ ఉన్న తాళ్ళరేవు స్థానం 2008 నియోజకవర్గాల
పునర్‌వ్యవస్థీకరణలో రద్దయింది.
1955 నుంచి 1972 వరకూ కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచారు.
1978లో జనతాపార్టీ గెలిచింది. 1983 నుంచి 1999 వరకూ తెలుగుదేశం తరఫున సి రామచంద్రరావు
వరుసగా గెలుస్తూ వచ్చారు. 2004లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2009లో కాకినాడ
రూరల్ నియోజకవర్గంగా మారిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం
పార్టీ తరఫున కురసాల కన్నబాబు గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి జరిగిన 2014
ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. 2019లో వైఎస్ఆర్‌సిపి తరఫున కన్నబాబు
మరోసారి గెలిచారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ
కూటమి పక్షాన జనసేన అభ్యర్ధిగా పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) బరిలో నిలిచారు. ఇండీ
కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా పిల్లి సత్యలక్ష్మి బరిలోకి దిగారు.