Jaggampeta Assembly Constituency Profile
జగ్గంపేట రాజకీయం ప్రధానంగా రెండు మూడు కుటుంబాల
మధ్యనే కేంద్రీకృతమై ఉంది. ఈసారి ఎన్నికల్లో జ్యోతుల, తోట కుటుంబాలు పోటీ
పడుతున్నాయి.
జగ్గంపేట శాసనసభా నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఆ
స్థానంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి గోకవరం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి.
జగ్గంపేటలో 1955, 1967 ఎన్నికల్లో స్వతంత్ర
అభ్యర్ధి గెలుపు దక్కించుకున్నారు. 1962, 1972, 1978లో కాంగ్రెస్ విజయం సాధించింది.
1983, 1985, 1989లో తెలుగుదేశం తరఫున తోట సుబ్బారావు గెలిచారు. 1991లో తోట వెంకటాచలం
గెలిచారు. 1994, 1999లో తెలుగుదేశం తరఫున జ్యోతుల నెహ్రూ గెలుపు సాధించారు. 2004,
2009లో కాంగ్రెస్ నుంచి తోట నరసింహం విజయం దక్కించుకున్నారు. 2014లో జ్యోతుల
నెహ్రూ, 2019లో జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్సిపి నుంచి గెలుపు సాధించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్సిపి తోట నరసింహాన్ని బరిలోకి దింపింది. 2016లో పసుపు కండువా కప్పుకున్న జ్యోతుల
నెహ్రూ ఇప్పుడు ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా మారోతి గణేశ్వరరావు నిలబడ్డారు.