Tuni Assembly Constituency Profile
‘తుని తగవు’ అనే పదబంధం వినే ఉంటారు. ఏదైనా
సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోడానికి తునిని రిఫరెన్స్‌గా చూపిస్తారు. తుని
శాసనసభా నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలోకి వస్తుంది. 1951లో ఏర్పడిన ఆ
నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. అవే తొండంగి, కోటనందూరు, తుని.
తుని నియోజకవర్గంలో ఆరంభంలో కాంగ్రెస్ ప్రాబల్యం
బలంగా ఉండేది. తరవాత తెలుగుదేశం ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. గత దశాబ్దకాలంలో ఆ నియోజకవర్గం
వైఎస్ఆర్‌సిపి చేతిలో ఉంది.
నియోజకవర్గం ఏర్పడ్డాక మొదటి ఎన్నికలు జరిగిన
1952 నుంచి 1978 వరకూ వరుసగా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఇక 1983 నుంచి 2004
వరకూ తెలుగుదేశం పార్టీయే గెలుస్తూ వచ్చింది. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి
వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికలు 2014, 2019లో వైఎస్ఆర్‌సిపి
విజయం దక్కించుకుంది.
2014లో దాడిశెట్టి రాజా వైఎస్ఆర్‌సిపికి ప్రాతినిధ్యం
వహించగా తెలుగుదేశం తరఫున యనమల కృష్ణుడు నిలబడ్డారు. 2019లో కూడా మళ్ళీ
వాళ్ళిద్దరే పోటీ పడ్డారు. రెండు సార్లూ దాడిశెట్టి రాజాయే విజయం సాధించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి తరఫున దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో పోటీ
పడుతున్నారు. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి యనమల దివ్య పోటీ
చేస్తున్నారు. ఈమె టిడిపిలో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి కుమార్తె. ఇండీ
కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి గెలం శ్రీనివాసరావు నిలబడ్డారు.