బిహార్
రాజధాని పాట్నాలో తీవ్ర విషాదం
చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో మంటలు చెలరేగడంతో ఆరుగురు
ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సమాచారం
అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు
చేపట్టారు.
ప్రమాద సమాచారం
అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకని సహాయ చర్యలు చేపట్టినట్లు అగ్నిమాపక
శాఖ డీఐజీ మృత్యుంజయ్ కుమార్ తెలిపారు. సుమారుగా 30 మందిని నుంచి కాపాడినట్లు తెలిపారు. సిలిండర్
పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చుని అధికారులు అనుమానిస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు