కాంగ్రెస్
పార్టీ బుజ్జగింపు రాజకీయాలను ప్రధాని మోదీ మరోసారి తూర్పారబట్టారు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల హక్కులను కాలేరాసే కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని
సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో
బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం
ఓబీసీల హక్కులను లాగేసుకుందన్నారు.
దేశవ్యాప్తంగా
కాంగ్రెస్ ఎక్కడ అధికారంలోకి వచ్చినా ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలను వంచించేందుకు పనిచేస్తోందని ఆరోపించారు.
కర్నాటకలో
ముస్లింలందరినీ ఓబీసీ జాబితాలో చేర్చుతూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి
రాత్రి నిర్ణయం తీసుకుందన్నారు.
యూపీలోనూ
అదే తరహా పంథాను అనుసరించేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోందని దుయ్యబట్టారు. సమాజ్వాదీ
పార్టీ, కాంగ్రెస్ కు పూర్తిగా వత్తాసు పలుకుతోందని
ప్రధాని మోదీ పేర్కొన్నారు.