Polling for second phase elections to be held tomorrow
లోక్‌సభ ఎన్నికల రెండోదశలో 12 రాష్ట్రాలు, 1
కేంద్రపాలిత ప్రాంతంలోని 89 నియోజకవర్గాలకు పోలింగ్ ఏప్రిల్ 26 శుక్రవారం అంటే
రేపు జరగనుంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రచారం గడువు నిన్న సాయంత్రం ముగిసింది.
అస్సాంలో మొత్తం 14 లోక్‌సభ స్థానాలున్నాయి. వాటిలో
5 స్థానాలకు రేపు పోలింగ్ జరుగుతుంది. అవి కరీంగంజ్, సిల్చార్, మంగళ్దోయ్, నావ్గాంగ్,
కలియాబోర్.
బిహార్‌లోని 40 నియోజకవర్గాల్లో 5 స్థానాలకు రేపు
పోలింగ్ జరగనుంది. అవి కిషన్‌గంజ్, పూర్ణియా, కటీహార్, భాగల్పూర్, బంకా
నియోజకవర్గాలు. బిహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ పొత్తులో ఉన్నప్పటికీ పూర్ణియాలో
కాంగ్రెస్ తరఫున పప్పూయాదవ్, ఆర్జేడీ నాయకురాలు బీమాభారతితో తలపడుతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని 11 నియోజకవర్గాల్లో 3 స్థానాలకు
రేపు పోలింగ్ జరుగుతుంది. అవి రాజనంద్‌గావ్, మహాసముంద్, కాంకేర్. రాజనంద్‌గావ్‌లో
కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పోటీ చేస్తున్నారు. నిజానికి ఈ స్థానం
బీజేపీ కంచుకోట. 2009 నుంచీ ఆ పార్టీయే గెలుస్తూ ఉంది.
కర్ణాటకలోని మొత్తం 28 స్థానాల్లో సగానికి సగం,
అంటే 14 స్థానాల్లో రేపు పోలింగ్ జరగనుంది. మిగతా సగం స్థానాలకూ మూడోదశలో పోలింగ్
జరుగుతుంది. ప్రస్తుతం శుక్రవారం జరిగే ఎన్నికల్లో బెంగళూరు గ్రామీణం, బెంగళూరు
ఉత్తరం, బెంగళూరు మధ్య, బెంగళూరు దక్షిణం, హసన్, మాండ్య, మైసూరు నియోజకవర్గాల్లో
పోరు హోరాహోరీగా ఉంటుందని అంచనా. బిజెపికి చెందిన తేజస్వి సూర్య, మాజీ ముఖ్యమంత్రి
కుమారస్వామి, కాంగ్రెస్ ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ సోదరుడు డికె సురేష్, మైసూరు
రాజవంశీకుడు యదువీర్ వడయార్ భవితవ్యం ఈ దశ ఎన్నికల్లోనే తేలిపోతుంది.
కేరళలోని మొత్తం 20 లోక్‌సభా నియోజకవర్గాలకూ రేపే
పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ మీదనే అందరి
దృష్టీ కేంద్రీకృతమైంది. అక్కడ సీపీఐ తరఫున యానీ రాజా, బీజేపీ తరఫున రాష్ట్ర
అధ్యక్షుడు కె సురేంద్రన్ పోటీపడుతున్నారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశి
థరూర్ బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ప్రముఖ
సినీనటుడు సురేష్ గోపి త్రిశూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్ధిగా కాంగ్రెస్‌కు
చెందిన కె మురళీధరన్, సీపీఎంకు చెందిన వీఎస్ సునీల్‌కుమార్‌లతో తలపడుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 పార్లమెంటు సీట్లలో 7
స్థానాలకు శుక్రవారం నాడు పోలింగ్ జరుగుతుంది. అవి టీకంగఢ్, దామో, ఖజురహో, సత్నా,
రేవా, హోషంగాబాద్, బేతుల్ నియోజకవర్గాలు.
మహారాష్ట్రలోని మొత్తం 48 ఎంపీ సీట్లలో 8
స్థానాల్లో రేపు పోటీ జరుగుతోంది. బుల్ధానా, అకోలా, అమరావతి (ఎస్సి), వార్ధా,
యవత్మాల్-వాషిం, హింగోలి, నాందేడ్, పర్భని ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. అమరావతి
నుంచి గతంలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన నవనీత్ రాణా ఇప్పుడు బీజేపీ టికెట్ మీద
బరిలో దిగింది. నాందేడ్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. అయితే మాజీ
ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బీజేపీలో చేరాక ఆ స్థానాన్ని కమలం పార్టీ గెలుచుకునే
అవకాశాలు కనిపిస్తున్నాయి.
మణిపూర్‌లో రెండు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి.
అవి ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్. మొదటి దశలో ఇన్నర్ మణిపూర్‌లో పోలింగ్ పూర్తయిపోయింది.
ఔటర్ మణిపూర్‌లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే పోలింగ్ జరిగింది. మిగతా 13
అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ రెండోదశలో అంటే రేపు జరుగుతుంది.
రాజస్థాన్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్నాయి.
వాటిలో 12 నియోజకవర్గాల్లో మొదటి విడతలో పోలింగ్ పూర్తయింది. మిగతా 13 స్థానాల్లో
పోలింగ్ రేపు జరుగుతుంది. అవేంటంటే టోంక్-సవాయ్‌మాధోపూర్, అజ్మేర్, పాలి, జోధ్‌పూర్,
బాఢ్‌మేర్, జలోర్, ఉదయ్‌పూర్, బాన్స్వాడా, చిత్తోడ్‌గఢ్, రాజసమంద్, భిల్వాడా,
కోటా, జలావర్-బారన్. జోధ్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోటీ
చేస్తున్నారు. జలోర్ నుంచి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ బరిలో
నిలబడుతున్నారు. ఇక లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇక్కడి కోటా నియోజకవర్గం నుంచి
బరిలోకి దిగుతున్నారు.
త్రిపురలో 2 నియోజకవర్గాలున్నాయి. త్రిపుర పశ్చిమ
నియోజకవర్గానికి పోలింగ్ మొదటిదశలో పూర్తయింది. ఇప్పుడు రెండో దశలో త్రిపుర ఈస్ట్
నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుంది.
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 స్థానాలున్నాయి. ఆ
రాష్ట్రంలో ఏడు దశల్లోనూ పోలింగ్ జరగనుంది. రెండో దశలో యూపీలో 8 స్థానాలకు పోలింగ్
జరగనుంది. అవి అమ్రోహా, మీరట్, బాఘ్పట్, గజియాబాద్, గౌతమ్‌బుద్ధ నగర్, అలీగఢ్,
మథుర, బులంద్‌షహర్. టీవీ రాముడు అరుణ్
గోవిల్ మీరట్ నుంచి, సినీనటి హేమామాలిని మథుర నుంచి బీజేపీ అభ్యర్ధులుగా పోటీ
చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 సీట్లలో 3 స్థానాలకు
రెండో దశలో పోలింగ్ జరగనుంది. అవి డార్జిలింగ్, బలూర్ఘాట్, రాయ్‌గంజ్. బలూర్‌ఘాట్‌లో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ తృణమూల్ నేత బిప్లబ్ మిత్రాతో తలపడుతున్నారు.
డార్జిలింగ్‌లో బీజేపీ నేత రాజు బిస్తా, తృణమూల్ అభ్యర్ధి గోపాల్ లామా మధ్య పోరు
హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసాక
జరుగుతున్న మొదటి ఎన్నికలివి. అక్కడ మొత్తం 5 నియోజక వర్గాలుంటే వాటిలో జమ్మూ
స్థానానికి రేపు పోలింగ్ జరగనుంది. జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన, రాజ్యాంగంలోని
365 అధికరణం రద్దు తర్వాత అక్కడ జరుగుతున్న ఎన్నికలివే. దాంతో జమ్మూలో బీజేపీ
గెలిచే అవకాశాలు సజీవంగా ఉన్నాయి.