మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో
భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్
సినిమాల్లోనూ నటిస్తోన్న ప్రముఖ నటి తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు
జారీ చేసింది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనుబంధ సంస్థ
ఫెయిర్ ప్లే యాప్ ప్రమోషన్ చేయడానికి సంబంధించిన
అంశంలో విచారణలో భాగంగా ఈ నెల 29న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని తాఖీదుల్లో మహారాష్ట్ర సైబర్
సెల్ పేర్కొంది.
గతేడాది ఐపీఎల్ మ్యాచ్ లను ఫెయిర్ ప్లే యాప్ చట్టవిరుద్ధంగా
స్ట్రీమింగ్ చేసిందని.. దీంతో తమకు కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటూ ఐపీఎల్ ప్రసార
హక్కులు పొందిన వయాకామ్ ఆరోపించింది.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు కూడా ఇదే కేసులో సమన్లు
పంపింది. విదేశాల్లో ఉన్నందున సంజయ్ దత్ విచారణకు హాజరుకాలేనని తన స్టేట్ మెంట్ నమోదు చేసేందుకు మరో తేదీ, సమయం పంపాలని
కోరారు.
మహాదేవ్ ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్
ద్వారా మనీలాండరింగ్ జరిగినట్లు కేసు
నమోదైంది.
ఈ కేసులో
ప్రధాన నిందితుడిగా ఉన్న రవి ఉప్పల్ ను దుబాయ్ పోలీసులు గతేడాది డిసెంబర్ లో
అదుపులోకి తీసుకున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు