భారతీయ రైల్వే ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది.దేశంలోని 100 ప్రధాన రైల్వే స్టేషన్లలో కేవలం రూ.20కే భోజనం అందించనున్నారు. ముఖ్యంగా థర్డ్ క్లాస్ ప్రయాణీకుల బోగీల వద్ద ఫ్లాట్ ఫారాలపై ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు.దేశ వ్యాప్తంగా 150 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పశ్చిమ రైల్వే
దీనిపై స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.ప్రయాణీకుల రద్దీని గమనించి రైల్వే శాఖ ఈ ఏర్పాట్లు చేసింది. వేసవి కాలం మొత్తం తక్కువ ధరకు భోజనం అందించనున్నారు.
ఎంతో పరిశుభ్రంగా రూ.20కే అందించే భోజనం ప్రయాణీకులు సంతృప్తి చెందేలా ఉంటుందని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. భోజనానికి అదనంగా స్నాక్స్ కూడా కలసి రూ.50కే అందిస్తున్నారు. 2023లో దేశ వ్యాప్తంగా 51 స్టేషన్లలో తక్కువ ధరకే భోజనాలకు అందించే ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం దాన్ని 100 స్టేషన్లకు విస్తరించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు