అతి భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. కొండ చరియలు విరిగి పడటంతో దిగాంబ్ వ్యాలీలో రవాణా వ్యవస్థ స్థంభించింది. చైనా సరిహద్దు జిల్లా దిబాంగ్ వ్యాలీలో కొండ చరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. హున్లీ, అనిని జాతీయ రహదారి 33పై రాకపోకలు నిలిచిపోయాయి. గడచిన కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఉత్తర ప్రాంత జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొండ చరియలు విరిగిపడటంతో జాతీయ రహదారి 33 మూసుకుపోయింది. రహదారిని పునరుద్దరించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ రంగంలోకి దిగింది. ప్రస్తుతానికి రవాణా వ్యవస్థ దెబ్బతిన్నా ప్రజలకు ఆహారం, నిత్యావసరాల కొరత లేదని అధికారులు వెల్లడించారు.