Payakaraopet Assembly Constituency Profile
అనకాపల్లి జిల్లాలోని ఒకేఒక ఎస్సీ రిజర్వుడు
నియోజకవర్గం పాయకరావుపేట. 1951లో ఏర్పడిన ఈ శాసనసభా స్థానంలో నాలుగు మండలాలు
ఉన్నాయి. అవి కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్ రాయవరం.
పాయకరావుపేట నియోజకవర్గంలో 1952లో స్వతంత్ర
అభ్యర్ధి గెలిచారు. 1962లో సిపిఐ గెలిచింది. 1967, 1972, 1978లో కాంగ్రెస్ వరుసగా
విజయం సాధించింది. 1983 నుంచి 2004 వరకూ వరుసగా తెలుగుదేశం పార్టీ గెలిచింది.
మళ్ళీ 2009లో కాంగ్రెస్‌నుంచి గొల్ల బాబూరావు గెలిచారు. తర్వాత ఆయన వైఎస్ఆర్సిపిలో
చేరారు. 2012 ఉపఎన్నికలో బాబూరావు వైఎస్ఆర్సిపి అభ్యర్ధిగా విజయం సాధించారు.
2014లో తెలుగుదేశం పార్టీ తరఫున వంగలపూడి అనిత
పోటీ చేసి, వైఎస్ఆర్సిపి అభ్యర్ధి చంగల వెంకట్రావును ఓడించారు. 2019లో వైఎస్ఆర్సిపి
మళ్ళీ గొల్ల బాబూరావును బరిలో దింపింది. ఆయన తెలుగుదేశం అభ్యర్ధి బంగారయ్య మీద
విజయం సాధించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్సిపి కంబాల జోగులును అభ్యర్ధిగా నిలబెట్టింది. ఎన్‌డిఎ కూటమి తరఫున
తెలుగుదేశం అభ్యర్ధి వంగలపూడి అనిత బరిలో నిలిచారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్
అభ్యర్ధిగా బోని తాతారావు పోటీ చేస్తున్నారు.