Elamanchili Assembly Constituency Profile
అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం
1951లో ఏర్పడింది. ఆ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి రాంబిల్లి,
మునగపాక, అచ్యుతాపురం, ఎలమంచిలి.
1952లో కృషికార్ లోక్‌పార్టీ గెలిచింది. 1962లోనూ
ఆ తర్వాత 1978లోనూ కాంగ్రెస్ గెలిచింది. 1955, 1967, 1972లో స్వతంత్ర అభ్యర్ధులు
విజయం సాధించారు. 1983 నుంచి 1999 వరకూ వరుసగా తెలుగుదేశం తరఫున పప్పల చలపతిరావు
గెలుపొందారు. 2004, 2009లో మళ్ళీ కాంగ్రెస్ విజయం సాధించింది.
2014లో తెలుగుదేశం తరఫున పంచకర్ల రమేష్‌బాబు పోటీ
చేసారు. వైఎస్‌ఆర్‌సిపి తరఫున ప్రగడ నాగేశ్వరరావు నిలబడ్డారు. కానీ రమేష్‌బాబే
గెలిచారు. 2019లో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధిని మార్చి యువి రమణమూర్తిరాజును
నిలబెట్టింది. తెలుగుదేశం తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మళ్ళీ పోటీచేసారు
కానీ గెలవలేకపోయారు.
ఇప్పుడు 2024లో వైఎస్‌ఆర్‌సిపి తమ సిట్టింగ్
ఎమ్మెల్యే రమణమూర్తి రాజును మళ్ళీ బరిలోకి దింపింది. ఎన్‌డిఎ కూటమి తరఫున జనసేన
పార్టీ సుందరాపు విజయ్‌కుమార్‌ను తమ అభ్యర్ధిగా నిలబెట్టింది. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా తర్ నర్సింగ్‌రావు పోటీ చేస్తున్నారు.