పతంజలి
ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు
తెలిపారు. రెండురోజుల వ్యవధిలో పతంజలి సంస్థ రెండుసార్లు క్షమాపణల ప్రకటనలు
తెలిపింది.
మొదటి
సారి ఇచ్చిన పేపరు ప్రకటన సైజు విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడతో
రెండోసారి పెద్ద పరిమాణంలో క్షమాపణలు ప్రకటనలు జారీ చేయాల్సి వచ్చింది.
తప్పుదోవ
పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో బేషరతుగా బహిరంగ క్షమాపణలు
చెబుతున్నట్లు వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి సంస్థ మంగళవారం విచారణ
సందర్బంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. పతంజలి
తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్
రోహత్గీ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ఆ ప్రకటనలు ఇచ్చినట్లు
తెలిపారు.
గతంలో
పతంజలి ఉత్పత్తుల ప్రకటనలో ఉపయోగించిన ఫాంట్ సైజునే వాడారా? అంతే పరిమాణంలో క్షమాపణలను
ప్రచురించారా?’ అని కోర్టు ప్రశ్నించింది. దీంతో బహిరంగ క్షమాపణలను పెద్ద సైజులో మరోసారి
ప్రచురిస్తామని రోహత్గీ బదులిచ్చారు.
నేడు వార్తాపత్రికల్లో క్షమాపణల ప్రకటనలు తెలిపారు.
ఈ
కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 30న
జరగనుంది. పతంజలి కోర్టు ధిక్కార అంశాన్నీ అప్పుడే విచారిస్తామని ధర్మాసనం
తెలిపింది. బహిరంగ క్షమాపణల ప్రకటనల వివరాలనుకోర్టుకు సమర్పించాలని, వాటి ప్రతులనూ పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది.
ఆధునిక
వైద్యవిధానాలను హేళన చేసేలా పతంజలి సంస్థ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం
గతేడాది నవంబర్‌లో పతంజలి యాజమాన్యాన్ని
మందలించింది. మరోసారి ఉల్లంఘనలూ జరగవంటూ కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, తర్వాత కోర్టుకిచ్చిన హామీని
ఉల్లంఘించడంతో రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణ
పలుమార్లు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ప్రత్యక్షంగా విచారణకు హాజరై
క్షమాపణలు తెలిపారు.