Sam Pitroda controversial comments on wealth distribution
సంపద పంపిణీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాం
పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఇప్పటికే, కాంగ్రెస్ ప్రజల
సంపదను లాక్కుని కొన్ని వర్గాలకు దోచిపెట్టే యోచనలో ఉందంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు
కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై అనుమానాలు రేకెత్తించాయి. శాం పిట్రోడా తాజా వ్యాఖ్యలతో
కాంగ్రెస్ పరిస్థితి మరింత లోతులో కూరుకుపోయినట్లయింది. దాంతో పిట్రోడా వ్యాఖ్యలతో
పార్టీకి సంబంధం లేదంటూ కాంగ్రెస్ ప్రకటించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం
జరిగిపోయింది.
దేశంలో సంపద కొంతమంది చేతుల్లో ఉండిపోయిందని,
దాన్ని సమానంగా ప్రజలందరికీ పంపిణీ చేస్తామనీ కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో
పెట్టిందని, అదే జరిగితే హిందువులు తమ ఆస్తులన్నీ కోల్పోవలసి వస్తుందని ప్రధానమంత్రి
ఇటీవలి తన ఎన్నికల ప్రసంగంలో చెప్పుకొచ్చారు. దానిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు
చేసారు,
అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా
తమ పార్టీ సంపదను పునఃపంపిణీ చేస్తే
తప్పేంటి అన్నట్లు ‘ఎక్స్’ లో పోస్ట్ చేసారు.
‘‘అమెరికాలో వారసత్వ పన్ను అని ఒకటుంది. ఒక
వ్యక్తికి 100 మిలియన్ డాలర్ల సంపద ఉంటే, అతను చనిపోయినప్పుడు అతని పిల్లలకు కేవలం
45శాతం మాత్రమే ఇవ్వగలడు. మిగతా 55శాతం ప్రభుత్వం లాగేసుకుంటుంది. అదొక మంచి
చట్టం. దాని ప్రకారం, మీ తరంలో మీరు ఆస్తి సంపాదిస్తారు. మీరు పోయేటప్పుడు మీ
సంపదని సమాజం కోసం వదిలేయాలి. అంతా కాదనుకోండి, సగం. అది నాకైతే మంచిదే
అనిపించింది’’. అని పిట్రోడా రాసుకొచ్చారు.
‘‘భారతదేశంలో అలాంటి చట్టం లేదు. అక్కడ ఎవరైనా ఒక
వ్యక్తి వెయ్యి కోట్లు సంపాదిస్తే, అతను చనిపోయాక ఆ మొత్తం ఆస్తి అతని పిల్లలకే
వెడుతుంది తప్ప సమాజానికి ఏమీ దక్కదు. ఇలాంటి విషయాల గురించి ప్రజలు చర్చించాలి. మనం
సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడుతున్నామంటే కొత్త విధానాల గురించి, ప్రజలకు
పనికొచ్చే కొత్త కార్యక్రమాల గురించీ మాట్లాడుతున్నామన్న మాట. అంతే తప్ప మహా
ధనవంతుల ప్రయోజనాల గురించి మాత్రమే మాట్లాడడం లేదు’’ అన్నారు పిట్రోడా.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో మీద ప్రధాని నరేంద్రమోదీ
చేసిన వ్యాఖ్యలతో శాం పిట్రోడా ఆందోళన చెందారు. సంపద పంపిణీ అనేది పూర్తిగా విధాన
నిర్ణయమని శాంపిట్రోడా అభిప్రాయపడ్డారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మెరుగైన విధానాన్ని
తయారుచేస్తుంది. భారతదేశంలో కనీస వేతనాల చట్టం లేదు. మనం కనీస వేతనాల చట్టం చేస్తే,
నువ్వు నీ సంపదలో నుంచి ఇంత మొత్తం పేదలకు పంచెయ్యాలి అదే సంపద పునఃపంపిణీ. ఇవాళ
ధనవంతులు తమ ఇళ్ళలో ప్యూన్లకు, దాసదాసీలకు, తమ ఇళ్ళలో పనిచేసేవారికీ సంపద పంచాలి.
కానీ వారు ఆ డబ్బును దుబాయ్లోనో, లండన్లోనో ఖర్చు పెట్టేసుకుంటారు. సంపద పంపిణీ
అంటే మనం ఒక కుర్చీలో కూర్చుని ఆ ఉన్న సంపదను అందరికీ పంచిపెట్టేయడం కాదు’’ అంటూ
పిట్రోడా తన ఆవేదనను వ్యక్తం చేసాడు.
కాంగ్రెస్ పార్టీ సంపద పంపిణీ పేరిట డబ్బులున్న
వారి సంపద పేద ప్రజలకు పంచాలని తమ మ్యానిఫెస్టోలో పెట్టింది. దానిపై ప్రధానమంత్రి
నరేంద్రమోదీ స్పందించారు. తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని సంపద
పునఃపంపిణీ గురించి ప్రస్తావించారు.