ఆంధ్రప్రదేశ్
లో ఎన్నికల కోడ్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం, పలువురు
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. తాజాగా ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ
చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాలను బదిలీ చేసింది.
ఎన్నికల
విధులతో సంబంధంలేని బాధ్యతలు అప్పగించాలని, వారి
స్థానంలో కొత్తవారిని నియమించాలని ఈసీ స్పష్టం చేసింది.
సీఎం
జగన్ పై రాయి దాడి విషయంలో భద్రతా వైఫల్యం, ప్రతిపక్షాల
ఫిర్యాదులతో ఈసీ ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఇంటెలిజెన్స్
చీఫ్, బెజవాడ సీపీగా ఎవర్ని నియమించాలనే
అంశంపై గా ప్రతిపాదనలు పంపాలని ఈసీ పేర్కొంది. ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లను
ప్రతిపాదిస్తూ జాబితా పంపాలని తెలిపింది. సదరు అధికారులకు చెందిన గత ఐదేళ్ళ పనితీరు నివేదికలు, విజిలెన్స్ క్లియరెన్సులను పంపాలని ఈసీ
స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇటీవల ఈసీకి
లేఖరాశారు. అందులో పలువురు అధికారుల పనితీరు గురించి వివరించినట్లు రాజకీయ
వర్గాల్లో చర్చ జరుగుతోంది.