వేసవిలో
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే
నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో ఐఆర్సీటీసీ తో కలిసి విజయవాడ
రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు.
జనరల్
బోగీ ప్రయాణికుల కోసం బోగీల వద్దే నేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రెండు
రకాల భోజన పార్శిళ్ళు విక్రయిస్తున్నారు.
ఈ
ప్రత్యేక కౌంటర్లను విజయవాడతో పాటు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మకంగా
అమలు చేస్తున్నారు. వేసవి కాలం మొత్తం ఈ ఈ కౌంటర్లు కొనసాగించనున్నారు. ఎకానమీ
మీల్స్ ప్యాకెట్ ధర రూ.20,
స్నాక్స్ మీల్స్ ధర రూ.50గా
నిర్ణయించారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ
సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు