శ్రీ
సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయ పరిణామం
చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద, హిందూపురం అసెంబ్లీ
నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
పరిపూర్ణానంద
ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించారు.
అయితే పొత్తులో భాగంగా హిందూపురం సీటు టీడీపీకి కేటాయించారు. సిట్టింగ్
ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు.
భారతదేశంలో
హిందూ పేరిట ఉన్న ఏకైక అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గం హిందూపురం కావడంతో ఇక్కడి
నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పరిపూర్ణానంద తెలిపారు. టీడీపీ పోటీ నుంచి
తప్పుకుని తనకు అవకాశం ఇవ్వాలని కూడా వ్యాఖ్యానించారు.
హిందూపురం
అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుపై టీఎన్ దీపిక పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్
అభ్యర్థిగా వి.నాగరాజు ఎన్నికల బరిలో
ఉన్నారు.
పరిపూర్ణానంద
స్వామిజీ పోటీతో హిందూపురంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కూటమి ఓట్ల
చీలడంతో వైసీపీకి మేలు జరుగుతుందనే వాదన కూడా ఉంది. అయితే పరిపూర్ణానందకు కూడా
తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉందని ఆయన విజయావకాశాలను తక్కువగా అంచనా
వేయలేమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.