భారతీయ
మజ్జూర్ సంఘ్ సీనియర్ నేత,
ప్రచారక్ శంకర సుబ్రమణియన్ సేవలను
స్మరిస్తూ ఆయనకు విశాఖ బీఎంసీ కార్యాలయంలో ఆ సంఘం నేతలు అంజలి ఘటించారు. ఏప్రిల్
19న గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన శంకర సుబ్రమణియన్, చికిత్స పొందుతూ
ప్రాణాలు విడిచారు. 1990 నుంచి ప్రచారక్ గా సేవలందిస్తున్న శంకర సుబ్రమణియన్, అంతకు ముందు వేలూరు జిల్లా కార్యవాహగా పనిచేశారు. ఓ టెక్స్ టైల్ మిల్లులో
సూపర్ వైజర్ గా పనిచేశారు.
బీఎంఎస్ లో వివిద హోదాల్లో పనిచేసిన శంకర సుబ్రమణియన్, 1999 లో తమిళనాడు కార్యదర్శిగా
బాధ్యతలు చేపట్టారు. మత్స్యకారులు, తేయాకు
కార్మికుల సమస్యల పరిష్కారనికి పనిచేయడంతో పాటు బీఎంఎస్ విస్తరణకు కృషి చేశారు.
మరణానంతరం కళ్ళను శంకర నేత్రాలకు దానం
చేశారు.
ఆర్ఎస్ఎస్
క్షేత్రప్రచారక్ భరత్ కుమార్ జీ ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని అంజలి ఘటించారు.
కార్యక్రమంలో
బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు మళ్ల జగదీశ్వర రావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ MVS నాయుడు, రాష్ట్ర సెక్రటరీ, ప్రచారక్ శ్రీ లోవ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రొక్కం సురేష్ కుమార్, జిల్లా సెక్రటరీ సరగడం చంద్రశేఖర్, జిల్లా కోశాధికారి సతీష్
పాల్గొన్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు