Srungavarapu Kota Assembly Constituency Profile
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం భౌగోళికంగా విజయనగరం జిల్లాలో ఉంది.
కానీ ఈ శాసనసభా స్థానం విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
1951లో ఏర్పడిన ఎస్ కోట నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. అవి శృంగవరపు కోట,
లక్కవరపు కోట, కొత్తవలస, వేపాడ, జామి.
ఎస్ కోటలో 1953లో టంగుటూరి ప్రకాశం పంతులుగారు
ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున ఏకగ్రీవంగా గెలవడం ఒక రికార్డు. అక్కడ 1960 వరకూ
కాంగ్రెస్ ఉనికే లేదు. 1962లో కూడా కాంగ్రెస్ గెలిచినా 1967లో స్వతంత్ర అభ్యర్ధికి
దారిచ్చింది. 1972, 1978లో మళ్ళీ కాంగ్రెస్ విజయాలు సాధించింది. 1983లో రంగప్రవేశం
చేసిన తెలుగుదేశం హవా 2014 వరకూ కొనసాగింది. మధ్యలో ఒక్కసారి 2004లో కాంగ్రెస్
అభ్యర్ధి విజయం సాధించగలిగారు.
2009, 2014లో రెండుసార్లు వరుసగా గెలిచిన
తెలుగుదేశం అభ్యర్ధి కోళ్ళ లలితకుమారికి 2019లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి కడుబండి
శ్రీనివాసరావు చెక్ పెట్టారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్‌సిపి
సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావునే మోహరించింది. అటు ఎన్‌డిఎ కూటమి తరఫున
తెలుగుదేశం అభ్యర్ధిగా కోళ్ళ లలితకుమారి మరోసారి బరిలోకి దిగారు.ఇండీ కూటమి తమ అభ్యర్ధిని ఇంకా ప్రకటించలేదు.ఇప్పుడు ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా
నిలిచింది.