పిఠాపురం
అసెంబ్లీ స్థానానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్డీయే కూటమి అభ్యర్థిగా
నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని నివాసం
నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు పవన్ ర్యాలీగా వెళ్లారు. జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు
కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
పాదగయ క్షేత్రం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో మండల
పరిషత్ కార్యాలయానికి వెళ్ళి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నామినేషన్
అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్డీయే కూటమి అఖండ విజయం
సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తనను
గెలిపిస్తే ప్రజలకు అండగా ఉండి వారి కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తానన్నారు.