ఢిల్లీ మద్యం పాలసీని అనుకూలంగా మలుచుకున్నారనే ఆరోపణలపై అరెస్టై తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండును రౌస్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. సరైన ఆధారాలు లేకుండా ఈడీ, సీబీఐ అధికారులు కవితను అరెస్ట్ చేశారని న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇస్తే కేసుతో సంబంధం ఉన్న వారిని ప్రభావితం చేసే అవకాశముందని, ఆమె చాలా ప్రభావితం చేయగల వ్యక్తని సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదలను విన్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితకు మరో 14 రోజులు జుడీషియల్ రిమాండు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది.
ఢిల్లీ మద్యం పాలసీని అనుకూలంగా మార్చు కోవడం ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం చేకూర్చడంతోపాటు, ఆప్ పార్టీకి గోవా, పంజాబ్ ఎన్నికల ఖర్చులకు కవిత రూ.100 కోట్లు ఇచ్చారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు కవితను ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. బెయిల్ ఇస్తే కేసులోని వ్యక్తులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు