హనుమాన్
జయంతి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు పోటెత్తిన భక్తులు, స్వామిని దర్శించుకుని
ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు
పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీరామ జయరామ నామ
స్మరణతో కొండగట్టు క్షేత్రం మార్మోగింది.
హనుమాన్ జయంతి సందర్భంగా కిక్కిరిసిపోయింది.
దీక్షాదారులు భారీగా తరలిరావడంతో కాషాయవర్ణ శోభితమైంది.
వేకువజాము
సమయంలో స్వామివారికి అభిషేక నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి సుమారు 50 వేల మంది దీక్షాపరులు హనుమస్వామిని దర్శించుకున్నారు. 22న ప్రారంభమైన ఉత్సవాలు రేపటితో
ముగియనున్నాయి.
హనుమ
స్వామి జయంతి సందర్భంగా సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ దేవాలయానికి
భక్తులు పోటెత్తారు. సువర్చల వీరాంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
చేస్తున్నారు. ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించారు.