పార్లమెంట్
ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, విపక్షాలపై
విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని
టోంక్-సవాయి మాధోపూర్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ..
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూ, కశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో
ఉండి ఉంటే, అక్కడ జవాన్లపై రాళ్ళ దాడులు జరిగేవన్నారు.
ప్రజలు మెచ్చిన బీజేపీ
పార్టీ సరిహద్దులో అధికారంలో ఉంది కాబట్టే ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు అదుపులో ఉండటంతో
పాటు, సుస్థిరత ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు.
కాంగ్రెస్
అధికారంలో ఉంటే సైనికులకు వన్ ర్యాంక్ వన్
పెన్షన్ అమలు అయ్యేది కాదని.. దేశంలో బాంబు పేలుళ్లు జరిగేవన్నారు. రాజస్థాన్ వరుస పేలుళ్ళ నిందితులను కాంగ్రెస్ పార్టీ
నేతలు కాపాడి పాపానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు.
పాలకపార్టీగా కాంగ్రెస్ ఉంటే అవినీతికి పాల్పడటానికి కొత్త మార్గాలు
వెతుక్కునేదని చురకలు వేశారు.
ఈ
రోజు హనుమాన్ జయంతి శుభ సందర్భం, ప్రతి
ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.