Muslim organization supports BJP in Nagaon of Assam
అస్సాంలోని ప్రముఖ ముస్లిం సంస్థ జమాత్ ఉలేమా
హింద్, నగావ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి సురేష్
బోరాకు మద్దతు ప్రకటించింది.
నగావ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా
సమావేశంలో జమాత్ ఉలేమా హింద్ సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. బీజేపీ పాలనలో
రాష్ట్రంలో ముస్లిములు సురక్షితంగా ఉన్నారని వారు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ
మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ మద్దతు బీజేపీ
అభ్యర్ధి సురేష్ బోరాకే ఉంటుందని వారు ప్రకటించారు.
జమాత్ ఉలేమా హింద్ అధ్యక్షుడు మౌలానా అతావుర్
కశ్మీరీ మాట్లాడుతూ బీజేపీ పాలనలో రాష్ట్రంలోని ముస్లిములకు ఎన్నో అభివృద్ధి ఫలాలు
అందాయని చెప్పుకొచ్చారు. స్థానిక ముస్లిములు సురేష్ బోరాకు ఓటు వేయాలని విజ్ఞప్తి
చేసారు. మరే అభ్యర్ధికి, ప్రత్యేకించి ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ తరఫున
పోటీ చేస్తున్న బద్రుద్దీన్ అజ్మల్‌కు ఓటు వేస్తే సామాజికవర్గపు ఓట్లు చీలిపోయి
ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుందని వివరించారు,
అస్సాంలో కాంగ్రెస్
పరిపాలన ఉన్నప్పుడు మతఘర్షణలు తరచుగా జరుగుతుండేవని మౌలానా అతావుర్ కశ్మీరీ గుర్తు
చేసారు. అయితే బీజేపీ పరిపాలనలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
నగావ్ నియోజకవర్గం పరిధిలో లాహ్రీఘాట్ నుంచి శీల్ఘాట్ వరకూ నదుల గట్ల వెంబడి ఎంబ్యాంక్మెంట్
నిర్మాణాలు పూర్తయ్యాయని సోదాహరణంగా వివరించారు.