బెంగళూరులోని
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరినీ షాక్కు గురి చేసే సంఘటన
చోటుచేసుకుంది. అనకొండలను స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు
పట్టుకున్నారు.
బ్యాంకాక్
నుంచి వచ్చిన ఓ విమాన ప్యాసింజర్ బ్యాగేజీని తనిఖీ చేయగా షాకింగ్ విషయాలు
వెలుగులోకి వచ్చాయి. సదరు ప్రయాణికుడి లగేజీ బ్యాగులో ఏకంగా 10 పసుపు రంగు
అనకొండలు ఉన్నట్లు గుర్తించారు.
తనిఖీల నిమిత్తం బ్యాగ్ తెరవగా అందులో తెల్ల
కవర్లలో అనకొండలను బంధించి ఉండటం గమనించారు.
దీంతో
నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు
చేపట్టినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న అనకొండల ఫొటోలను
సోషల్ మీడియాలో షేర్ చేశారు. వన్యప్రాణుల స్మగ్లింగ్ ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని తెలిపారు.
వన్యప్రాణుల
స్మగ్లింగ్ ను నిరోధానికి కస్టమ్స్ యాక్ట్
-1962లో పలు సెక్షన్లు పొందుపరిచారు. బ్యాంకాక్ ప్రయాణికుడి చర్యను సోషల్ మీడియా
వేదికగా పలువురు నెటిజన్లు తప్పుబట్టారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు