మద్యం పాలసీని కొందరిని అనుకూలంగా రూపొందించి, మనీలాండరింగ్‌నకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టై, తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు డాక్టర్ల బృందం ఇన్సులిన్ ఇచ్చింది. షుగర్ లెవల్స్ 320కు చేరడంతో డాక్టర్లు ఇన్సులిన్ ఇచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. కేజ్రీవాల్‌కు వైద్య సేవలు అందకుండా కుట్ర చేస్తున్నారంటూ ఆప్ పార్టీ నేతలు కొంత కాలంగా విమర్శలు చేస్తున్నారు. ఆయనకు ఇన్సులిన్ అవసరం ఉందా లేదా తేల్చేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఎయిమ్స్ డైరెక్టర్‌ను ఆదేశించింది.
కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వాలని మేం ఎప్పటి నుంచో కోరుతున్నాం. అధికారులు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు సీఎంకు ఎందుకు ఇన్సులిన్ ఇచ్చారంటూ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు. ఎయిమ్స్ డాక్టర్లతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు సీఎం ఇన్సులిన్ విషయం అసలు ఎత్తలేదని, డాక్టర్లు కూడా ఇన్సులిన్
అవసరమనే విషయం చెప్పలేదని జైలు అధికారులు చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, తనకు షుగర్ లెవల్స్ ప్రమాదకరంగా పెరిగాయని కేజ్రీవాల్ ఆరోపించారు.