Hassan Uddin who smuggled drugs through India Post
arrested
ఈశాన్య భారతం నుంచి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు
అక్రమ రవాణా చేసే హసనుద్దీన్‌ను నాగాలాండ్ పోలీసులు అరెస్ట్ చేసారు. అతను డ్రగ్స్
స్మగుల్ చేసే పద్ధతి తెలుసుకుని వారు నివ్వెరపోయారు. హసనుద్దీన్ అరెస్టుతో
మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారానికీ, ఫార్మసీలకు మధ్య ఉన్న సంబంధం బైటపడింది.
డ్రగ్స్ స్మగ్లింగ్‌కు సంబంధించి నాగాలాండ్,
అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
వారు నాగాలాండ్‌లోని దిమాపూర్ నగరంలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న హసనుద్దీన్‌ను ఇటీవలే
అరెస్ట్ చేసారు. వారి విచారణలో హసనుద్దీన్ దిమాపూర్ నుంచి పశ్చిమబెంగాల్‌కు
మార్ఫిన్ అనే మత్తుపదార్ధాన్ని పోస్టల్ డెలివరీ సిస్టమ్ ద్వారా అక్రమంగా రవాణా
చేస్తున్న సంగతి బైటపడింది.
హసనుద్దీన్ దిమాపూర్‌లోని ముర్గీ పత్తీ ప్రాంతంలో
ఒక మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అతను మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న మోరే అనే
చిన్న పట్టణం నుంచి మార్ఫిన్ కొనుగోలు చేసేవాడు. దాన్ని పోస్టల్ రవాణా ద్వారా
ఫార్మా మందులు పంపిస్తున్నట్లుగా రవాణా చేసేవాడు. పశ్చిమబెంగాల్ పోలీసులు ఈ యేడాది
ఫిబ్రవరిలో బారక్పూర్లో రూ.8కోట్ల విలువ చేసే సుమారు 2 కేజీల పార్సెళ్ళను కనుగొన్నారు.
దాన్నుంచి తీగ లాగితే హసనుద్దీన్ డొంక కదిలింది.
హసనుద్దీన్ అలియాస్ హసన్ మామూ తన సోదరుడు
కమాలుద్దీన్‌తో కలిసి డ్రగ్స్ అక్రమరవాణా, తదితర నేరాలకు పాల్పడుతుండేవాడు. వారితో
పాటు మరికొంతమంది నేరస్తులు కూడా ఆ దందాలో భాగస్వాములు. వేరే నేరాల్లో జైలుపాలై
బెయిల్ మీద బైటకు వచ్చినవారు సైతం ఆ అక్రమ వ్యాపారంలో పాల్గొనేవారని పోలీసుల విచారణలో
తేలింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు