తూర్పు
ఆసియా దేశమైన తైవాన్ లో వరుస భూకంపాలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సోమవారం
రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 80 సార్లు భూ
ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
తైవాన్
తూర్పు తీరంలో అత్యధికంగా 6.3గా తీవ్రత నమోదు కాగా, దేశ రాజధాని తైపీలో పలు భవనాలకు
బీటలు ఏర్పడ్డాయి.
హువాలియన్‌లో
ఎక్కువ భూకంప కేంద్రాలను గుర్తించారు. ఏప్రిల్ 3న తైవాన్‌లో భూకంపం కారణంగా 14
మంది మరణించారు. అప్పటి నుంచి తైవాన్ లో వరుస భూప్రకంపనలు వస్తున్నాయి. ఏప్రిల్ 3న సంభవించిన భూకంపంతో హువాలియన్‌లో
కొద్దిగా వంగిన ఓ హోటల్ తాజా భూకంపం ప్రభావంతో మరింతగా దెబ్బతింది.
‘టెక్టోనిక్
ప్లేట్స్’ జంక్షన్‌కు సమీపంలో తైవాన్ ఉండటంతో ఆ దేశంలో తరుచుగా భూకంపాలు
వస్తున్నాయి. 2016లో దక్షిణ తైవాన్‌లో భూకంపం ధాటికి 100 మందికి పైగా ప్రాణాలు
కోల్పోయారు. 1999లో ఏ ఏకంగా 2,000 మందికి పైగా తైవాన్ వాసులు మృతిచెందారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు