Nellimarla Assembly Constituency Profile
నెల్లిమర్ల అనగానే జౌళి పరిశ్రమ గుర్తుకొస్తుంది.
నెల్లిమర్ల శాసనసభా నియోజకవర్గం 2008లో ఏర్పడింది. అంతకుముందు సతివాడ, భోగాపురం
నియోజకవర్గాల్లోని కొన్ని సెగ్మెంట్లు కలిపి ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఆ రెండు
స్థానాలూ అప్పుడే రద్దయిపోయాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి.
అవి నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం.
2009 ఎన్నికల్లో నెల్లిమర్లలో కాంగ్రెస్ అభ్యర్ధి
బడ్డుకొండ అప్పలనాయుడు తెలుగుదేశం ప్రత్యర్థి పతివాడ నారాయణస్వామినాయుడుపై కొద్దిపాటి
మెజారిటీతో గెలిచారు. 2014లో వైఎస్ఆర్‌సిపి రంగప్రవేశం చేసింది. అప్పుడు
తెలుగుదేశం అభ్యర్ధి పతివాడ నారాయణస్వామినాయుడు వైసీపీ అభ్యర్ధి పివివి
సూర్యనారాయణరాజుపై విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు మూడోస్థానానికి
పరిమితమైపోయారు. పతివాడ నారాయణస్వామి నాయుడు ఎమ్మెల్యేగా గెలవడం అది ఏడవసారి. సీమాంధ్ర
రాజకీయాల్లో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెండోవ్యక్తి నారాయణస్వామి నాయుడు. ఆ
రికార్డు సాధించిన మొదటివ్యక్తి చంద్రబాబునాయుడు. అయితే నారాయణస్వామినాయుడు ప్రభ
అక్కడితో ఆగిపోయినట్లే ఉంది. 2019లో బడ్డుకొండ అప్పలనాయుడు వైఎస్ఆర్‌సిపి తరఫున
పోటీ చేసి, పతివాడ నారాయణస్వామిని దాదాపు 30వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఈసారి
ఎన్నికల్లో ఈ సీటు పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం నుంచి జనసేనకు వెళ్ళింది.
2024లో వైఎస్‌ఆర్‌సిపి
తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ తరఫున
జనసేనపార్టీ అభ్యర్ధి లోకం నాగమాధవి బరిలోకి దిగుతున్నారు. ఇండీ కూటమి తరఫున
కాంగ్రెస్ అభ్యర్ధిగా సరగడ రమేష్ కుమార్ తలపడుతున్నారు.