Gajapathinagaram Assembly Constituency Profile
విజయనగరం జిల్లాలోని ప్రధానమైన నియోజకవర్గాల్లో
గజపతినగరం ఒకటి. 1955లో ఏర్పాటైన ఈ నియోజక వర్గంలో ఐదు మండలాలున్నాయి. అవి
గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, దత్తిరాజేరు, జామి.
గజపతినగరంలో ఏ రెండుసార్లూ ఒక పార్టీ వరుసగా గెలిచిన
దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. 80లలో తెలుగుదేశం పార్టీ వచ్చాక కూడా అదే పరిస్థితి.
1989, 1994లో మాత్రం టిడిపి వరుసగా రెండుసార్లు గెలిచింది.
గజపతినగరంలో 1972 వరకూ కాంగ్రెస్ అడుగు పెట్టలేదు.
1978లో జనతా పార్టీ గెలిచింది. 1983లో తెలుగుదేశం రంగప్రవేశం చేసింది. 1985లో
కాంగ్రెస్ మళ్ళీ గెలుపు సాధించింది. అయితే 1989, 1994లో తెలుగుదేశం అభ్యర్ధి పడాల
అరుణ రెండుసార్లు వరుసగా విజయం సాధించగలిగారు. 1999లో కాంగ్రెస్ గెలిచినా 2004లో
మళ్ళీ టిడిపి నుంచి అరుణ గెలిచారు. 2009లో కాంగ్రెస్ తరఫున బొత్స సత్యనారాయణ
సోదరుడు బొత్స అప్పలనరసయ్య విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన ప్రభావంతో
ఓడిపోయినప్పటికీ, కాంగ్రెస్ నుంచి పోటీచేసి డిపాజిట్ దక్కించుకున్న అతితక్కువమంది
అభ్యర్ధుల్లో ఒకరిగా అప్పలనరసయ్య నిలిచారు. 2019లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిగా పోటీ
చేసి గెలవగలిగారు.
ఇప్పుడు 2024లో వైఎస్‌ఆర్‌సిపి
తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా బొత్స అప్పలనరసయ్య మళ్ళీ నిలబడ్డారు. ఎన్‌డిఎ కూటమి తరఫున
తెలుగుదేశం అభ్యర్ధి కొండపల్లి శ్రీనివాస్, ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి
దోలా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.