Bobbili Assembly Constituency Profile
విజయనగరం అనగానే గుర్తుకువచ్చే పేరు బొబ్బిలి. తెలుగువారి
చరిత్రలో బొబ్బిలికి ఉన్న ప్రాధాన్యతే వేరు. బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం 1951లో
ఏర్పడింది. అప్పటినుంచీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యత ఉండేది. 1952 మొదలు ఇప్పటివరకూ ఆ
పార్టీ 7సార్లు విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 1983, 1985, 1994లో మాత్రమే గెలిచింది.
2004, 2009 ఎన్నికల్లో సుజయకృష్ణరంగారావు కాంగ్రెస్
అభ్యర్ధిగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్‌ఆర్‌సిపిలో చేరి 2014లో ఆ
పార్టీ తరఫున గెలిచారు. అయితే ఆ పదవీకాలంలోనే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు.
2019లో తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసి వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి ఎస్ వెంకట చినఅప్పలనాయుడు
చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి తరఫున
సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్ వెంకట చినఅప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి
తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా ఆర్ఎస్‌వికెకె రంగారావు (బేబినాయన) బరిలో ఉన్నారు.
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా మరిపి విద్యాసాగర్ నిలబడ్డారు.