Rajam Assembly Constituency Profile
రాజాం విజయనగరం జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు
స్థానం. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా
ఏర్పడింది. రాజాం అసెంబ్లీ స్థానంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి రాజాం, వంగర,
సంతకవిటి, రేగిడి ఆమదాలవలస.
రాజాం నియోజకవర్గం ఏర్పడడానికి ముందు ఉణుకూరు
నియోజకవర్గం ఉండేది. అంతకంటె ముందు హోంజరం నియోజకవర్గం ఉండేది. 1952 ఎన్నికలో హోంజరం
నుంచి కృషికార్ లోక్ పార్టీ తరఫున పిపి చార్యులు గెలిచారు. 1955లో ఉణుకూరు
నియోజకవర్గం ఏర్పడ్డాక అదే పార్టీ నుంచి సిఎస్ నాయకులు గెలిచారు. 1962, 1972
రెండుసార్లు మాత్రం కాంగ్రెస్ గెలిచింది. 1967లో స్వతంత్ర అభ్యర్ధి, 1978లో జనతా
పార్టీ గెలిచాయి. ఆ తర్వాత తెలుగుదేశం తరఫున కిమిడి కళావెంకట్రావు వరుసగా మూడుసార్లు
1983, 1985, 1989లో గెలిచారు. 1994లో కాంగ్రెస్ ఐ గెలవగా మళ్ళీ 1999, 2004లో తెలుగుదేశం
గెలిచింది. 2009లో ఉణుకూరు నియోజకవర్గం రద్దయి రాజాం నియోజకవర్గం ఏర్పడింది.
అప్పుడు జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019లో వైఎస్‌ఆర్‌సిపి తరఫున
కంబాల జోగులు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.
ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి తరఫున
డాక్టర్ తాలె రాజేష్ పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా
కోండ్రు మురళీమోహన్ బరిలో నిలిచారు. ఇండీ కూటమి తరఫున కంబాల రాజవర్ధన్
తలపడుతున్నారు.