Etcherla Assembly Constituency Profile
ఎచ్చెర్ల భౌగోళికంగా శ్రీకాకుళం జిల్లాలో
ఉన్నప్పటికీ, ఈ శాసనసభా నియోజకవర్గం విజయనగరం లోక్‌సభా నియోజకవర్గం పరిధిలో ఉంది.
ఈ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. అంతకుముందు ఈ ప్రాంతం షేర్ మహమ్మద్‌పురం నియోజకవర్గంలో
ఉండేది. ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి ఎచ్చెర్ల,
లావేరు, రణస్థలం, జి సిగడాం.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్
ఆధిక్యమే ఉండేది. 1978లో ఒకసారి జనతా పార్టీ గెలిచింది. 1983 నుంచి తెలుగుదేశం హవా
మొదలైంది. ప్రతిభా భారతి వరుసగా 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో విజయం
సాధించారు. 2004లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది. ప్రతిభా భారతిని కోండ్రు
మురళీమోహన్ ఓడించారు. 2009లో కాంగ్రెస్ తరఫున మీసాల నీలకంఠం పోటీ చేసి తెలుగుదేశం
అభ్యర్ధి ఎన్ సూర్యనారాయణరెడ్డిని ఓడించారు. 2014లో తెలంగాణ విభజన తర్వాత
తెలుగుదేశం వేవ్‌లో కిమిడి కళావెంకట్రావు వైఎస్ఆర్సిపి అభ్యర్ధి గొర్లె కిరణ్
కుమార్‌పై విజయం సాధించారు. 2019లో జగన్ వేవ్‌లో కళావెంకట్రావు మీద కిరణ్ కుమార్ గెలిచి,
ప్రతీకారం తీర్చుకున్నారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్సిపి నుంచి గొర్లె కిరణ్ కుమారే మళ్ళీ అభ్యర్ధిగా నిలబడ్డారు. తెలుగుదేశం
మాత్రం ఈసారి ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా ఈ స్థానాన్ని బిజెపికి కేటాయించింది. ఆ
పార్టీ తరఫున ఎన్ ఈశ్వరరావు రంగంలోకి దిగారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్
అభ్యర్ధిగా కరిమజ్జి మల్లేశ్వరరావు ఈ ఎన్నికలో తన అదృష్టాన్ని
పరిశీలించుకుంటున్నారు.