కోనసీమ జిల్లాల్లో ఓ రైతు పొలంలో వేసిన బోరు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని దిండి కాసవరపు లంకలో ఈ ఘటన జరిగింది. మంచి నీటి కోసం బోరు తవ్వుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు.
బోరు నుంచి మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే మంటలు అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. భూమిలో గ్యాస్ పైపు లైన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓఎన్జీసీ గతంలో భూమిలో గ్యాస్ పైపులు వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓఎన్జీసీ అధికారులకు కూడా సమాచారం అందించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు