బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2016లో మమతా బెనర్జీ ప్రభుత్వం స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ ద్వారా జరిపిన నియామకాలు చెల్లవని కలకత్తా హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. 2016లో జరిపిన నియామకాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగాల్లో చేరిన వారు ఇప్పటి వరకు తీసుకున్న జీతాలను వెనక్కు ఇచ్చి వేయాలని కూడా ధర్మాసనం తీర్పు చెప్పింది.
ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతులకు బోధించే ఉపాధ్యాయులతోపాటు, దిగువస్థాయి సిబ్బందిని కూడా ప్రభుత్వం 2016లో నియమించింది. 24650 ఉద్యోగాలకు 23 లక్షల మంది పోటీ పరీక్షలు రాశారు. 25,753 మందికి ఉద్యోగబనియామక పత్రాలు అందించారు. ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ కుంభకోణం చోటుకోవడంతో దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ కేసులన్నీ విచారించడానికి సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్టులో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసింది. సుదీర్ఘంగా విచారణ జరిగింది.2016లో ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని కోర్టు నిర్ధారించింది. దీంతో అప్పటి నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. అంతేకాదు, ఇప్పటి వరకు తీసుకున్న జీతాలు కూడా వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు