ఏపీలో పది ఫలితాలు వచ్చేశాయి. టెన్త్ ఫలితాలను ఆంధప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఇవాళ విడుదల చేశారు. మొత్తం 6 లక్షల 23 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.వారిలో 86.69 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు ఆయన మీడియాకు ప్రకటించారు. పది ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. బాలురు 84.32 శాతం, బాలికలు 89.17 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
గత మార్చి 18 నుంచి 30 తేదీ వరకు పది పరీక్షలు నిర్వహించారు. మొత్తం 7 లక్షల మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా వీరిలో 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులని విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. పరీక్షల్లో తప్పిన మొత్తం విద్యార్థులు లక్ష మందిపైగా ఉన్నారు.ఏపీలో 3473 కేంద్రాల్లో పరీక్షలు జరిపారు. ఈ ఏడాది చాలా త్వరగా పది పరీక్షల మూల్యాకనం పూర్తి చేసినట్లు కమిషనర్ సురేష్ కుమార్ స్పష్టం చేశారు.
పది ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలో 93.7 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.కర్నూలు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 67 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 2300 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా 17 బడుల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పది ఫలితాలను విద్యాశాఖ వెబ్సైట్ www.bse.ap.gov.inలో అందుబాటులో ఉంచారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు