కాంగ్రెస్
పార్టీ అగ్రనేత సోనియాగాంధీపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాజస్థాన్లోని
జలోర్ ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేని నేతలకు రాజ్యసభకు వెళ్ళేందుకు రాజస్థాన్
అడ్డాగా మారిందన్నారు.
దక్షిణాది
నుంచి కేసీ వేణుగోపాల్, తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్
ఇప్పుడు మరో నేత రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్ళారంటూ సోనియాగాంధీని ఉద్దేశించి
మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు
400 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 300 సీట్లలో పోటీ చేసే
అభ్యర్థులు దొరకడం లేదన్నారు. ఆ పార్టీ చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి
దాపురించిందన్నారు. ఇండీ కూటమి పేరుతో రాజకీయాలు చేస్తూ 25 శాతం సీట్లలో ఒకరిపై ఒకరు పోటీ
చేస్తున్నారని దుయ్యబట్టారు.