హర్యానా
రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. శ్మశానవాటిక
గోడ కూలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
గురుగ్రామ్‌లోని అర్జున్
నగర్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్మశానవాటిక గోడకు సమీపంలో ఓ కుటుంబం నివాసం
ఉంటుంది. అయితే ఆదివారం తెల్లవారుజామున శ్మశాన వాటిక గోడ కూలింది. దీంతో ఇద్దరు
చిన్నారులతో పాటు మరో నలుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన
స్థానికులు శిథిలాలను తొలగించారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
తాన్యా(11),
దేవి దయాల్(70), మనోజ్ గబా(54), కృష్ణ కుమార్(52) మరణించారు. తీవ్రంగా గాయపడిన
దీప్ ప్రధాన్ అనే వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం
అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన
వారిని ఆస్పత్రికి తరలించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు