సార్వత్రిక ఎన్నిలకు ఏపీలో నామినేషన్లు జోరుగా సాగుతుండగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఉండి, పాడేరు, వెంకటగిరి, మడకశిర, మాడుగులలో ఇప్పటికే ప్రకటించిన వారిని మార్చి కొత్త అభ్యర్థులను ప్రకటించారు.
వైసీపీకి రాజీనామా చేసిన నరసాపురం ఎంపీ రఘురామరాజుకు ఉండి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఖరారైంది. మాడుగులలో బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం లభించింది. మడకశిరలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు అవకాశం దక్కింది.వెంకటగిరిలో ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన లక్ష్మీప్రియ తండ్రి రామకృష్ణను తెరమీదకు తెచ్చారు.పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి టికెట్ దక్కింది.
ఇక దెందులూరు, అనపర్తి, తంబళ్లపల్లె స్థానాల్లో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. అందుకే అక్కడ ఎవరికీ బి ఫారాలు ఇవ్వలేదు.ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ తరపున పోటీచేసే వారందరికి బి ఫారాలు ఇచ్చి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనపర్తిలో టీడీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఆ తరవాత ఆయనకు బీజేపీ బి ఫాం ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.