శక్తిపీఠం,
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26న శ్రీభ్రమరాంబికా అమ్మవారికి వార్షిక
కుంభోత్సవం నిర్వహించనున్నారు. ప్రతీఏటా చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం
రోజున కానీ శుక్రవారం రోజున కానీ (ఏ రోజు
ముందు వస్తే ఆ రోజు) అమ్మవారికి సాత్విక బలి సమర్పించడమే కుంభోత్సవం.
కుంభోత్సవం
సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు, చండీ హోమం కార్యక్రమాలు
నిలిపివేసినట్లు ఈవో డీ పెద్దిరాజు తెలిపారు.
ఉత్సవ సంబంధ విశేష పూజలన్నీ
అమ్మవారికి ఏకాంతంగా నిర్వహించడం సంప్రదాయం. దీంతో ఈ నెల 26 రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల
వరకూ మాత్రమే భక్తుల సర్వ దర్శనానికి అనుమతి ఉంటుంది.
కుంభోత్సవం
సందర్భంగా సాయంత్రం నుంచి శ్రీస్వామి వారి ఆలయంలో సర్వదర్శనం, ఆర్జిత సేవలు నిలిపివేయనున్నారు.
కుంభోత్సవం మరునాడు ఈ నెల 27న ఉదయం 7.30 గంటల నుంచి ఉభయ దేవాలయాల్లో దర్శనాలు, ఆర్జిత సేవలు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
దేవాదాయ, ధర్మాదాయ చట్టం మేరకు శ్రీశైల క్షేత్ర
పరిధిలో జీవహింస నిషేధం. పక్షి, జంతు
బలులు పూర్తిగా నిషేధించినట్లు ఈఓ డీ పెద్ది రాజు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే
చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.