రైళ్ళ
ఏసీ కోచుల్లో విపరీతమైన రద్దీ ఉందంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంపై రైల్వే
శాఖ స్పందించింది. పాత వీడియోలను షేర్ చేస్తూ రైల్వే పై తప్పుడు ప్రచారం
చేస్తున్నారని వివరించింది.
రైల్వే
శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వీడియోలను
షేర్ చేయొద్దని ప్రజలను కోరింది.
సోషల్
మీడియాలో వైరలవుతున్న వీడియోలపై ఆరా తీయగా క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పులు
జరగలేదని తేలిందన్నారు. తాము కూడా సామాజిక
మాధ్యమాల ద్వారా వివరణ ఇస్తున్నామని తెలిపారు.
వీడియోల్లోని
ఘటనలకు సంబంధించి ఆధారాలేవీ లభ్యం కాలేదని తేల్చి చెప్పింది.
ఓ వినియోగదారుడి ఫిర్యాదుపై స్పందించిన రైల్వే
శాఖ.. ఎక్కడా రద్దీ లేదని, దయచేసి మా
ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దు అని సమాధానం ఇచ్చింది. సేవాలోపాల పేరిట దయచేసి పాత వీడియోలు షేర్ చేయవద్దని
కోరింది.
రైళ్ళల్లో ప్రస్తుత పరిస్థితిని గమనించి, భారతీయ
రైల్వే ప్రస్తుతం రికార్డు స్థాయిలో అదనపు రైళ్ళను నడిపిస్తోందని తెలిపింది.
కైఫియత్
ఎక్స్ప్రెస్లో రద్దీ భరించలేక ఓ ప్రయాణికుడు కిటీకీ అద్దం పగలగొట్టినట్లు
జరుగుతున్న ప్రచారాన్ని రైల్వే శాఖ ఖండించింది. అసలు అలాంటి ఘటనే జరగలేదని తమ అంతర్గత
దర్యాప్తులో తేలిందని పేర్కొంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు