ఉత్తరప్రదేశ్‌లోని
మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్
సింగ్ మృతి చెందారు. దిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో గుండెపోటుతో మృతిచెందారు. కున్వర్
సర్వేశ్ సింగ్(71) గత కొంతకాలంగా గొంతు సమస్యతో
బాధపడుతున్నారు. గతంలో ఆయనకు ఆపరేషన్ కూడా జరిగింది. సాధారణ పరీక్షల కోసం శనివారం
ఎయిమ్స్‌కు వెళ్లిన కున్వర్ అక్కడ గుండెపోటుతో మరణించారని ఉత్తరప్రదేశ్ బీజేపీ
చీఫ్ భూపేంద్ర చౌదరి తెలిపారు.
తొలి
దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19న మొరాదాబాద్
లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసింది. ఇండీ కూటమి తరఫున రుచి వీర పోటీలో
ఉన్నారు. మొరాదాబాద్ శాసనసభ స్థానం నుంచి ఐదు సార్లు కున్వర్ సింగ్ విజయం
సాధించారు.
కున్వర్ సర్వేశ్ సింగ్ మరణం పట్ల ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగా ఆదిత్యనాథ్ కూడా కున్వర్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు.