పురోహితులు, పూజారులపై అరాచకాలు ఆగడం లేదు. ఇటీవల కాకినాడ పెద్దశివాలయంలో వైసీపీ నేత ఒకరు పూజారి చెంప పగులకొట్టాడు. తరవాత కేసులు లేకుండా క్షమాపణలు చెప్పి పరిష్కారం చేసుకున్నారు. ఆ ఘటన మరువకముందే మరొక అరాచకం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పురోహితుడు సూర్యానారాయణమూర్తి ఓ వివాహం జరిపించారు. వివాహం అనంతరం అతనిపై కొందరు ఆకతాయిలు సంచి నెత్తమీద వేయడం, పసుపు, కుంకుమ, వాటర్ ప్యాకెట్లు తలపై విసిరారు. ఇదంతా వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
పూజారులు, పురోహితులను కించపరిచే విధంగా చేయడాన్ని బ్రాహ్మణ, విశ్వహిందూ పరిషత్తు సంఘాలు ఖండించాయి. ఇలాంటి అరాచకాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడిని పరామర్శించారు. దీనిపై సూర్యనారాయణ మూర్తి తీవ్ర వేదనకు లోనైనట్లు చెప్పుకొచ్చారు. సోమవారం సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు