దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత్తలు స్వల్పంగా తగ్గాయని ఐఎండి తెలపింది.మిలిగిన ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావారణ
అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో వేసవి తీవ్రత అధికమైంది. ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడి, లానినా బలపడుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవిలో 10 నుంచి 20 రోజుల పాటు వడగాలులు వీచే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితులు నెలకొనడం చరిత్రలో ఇది రెండోసారని గణాంకాల ద్వారా తెలుస్తోంది.