ఎన్నికల్లో
ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలబడాలని టీడీపీ అధినేత
చంద్రబాబు అన్నారు. వైసీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై
ఉందన్నారు. ప్రజాగళం యాత్రంలో భాగంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో పర్యటించిన
చంద్రబాబు, తాను అనునిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తానన్నారు. జగన్ మాత్రం ప్రజలను ఎలా
మోసం చేయాలో ఆలోచిస్తారని విమర్శించారు.
తల్లిని, చెల్లిని పట్టించుకోని వ్యక్తి రాష్ట్రానికి న్యాయం చేస్తారా అని
ప్రశ్నించారు. రాష్ట్రంలో క్యాష్ వార్
నడుస్తోందన్నారు. డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోందని చంద్రబాబు ఆరోపించారు.
గూడురు
పర్యటనలో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. సంపద
సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని
అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. వైసీపీ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదన్నారు.