కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అమేథిలో ఓడినట్లే
వాయనాడ్ లో కూడా
రాహుల్ గాంధీ ఓడిపోతారని ప్రధాని మోదీ జోస్యం
చెప్పారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో
జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఓటమి ఖాయమన్నారు.
వాయనాడ్ లో ఓటమి తర్వాత మరో సురక్షిత స్థానాన్ని వెతుక్కోక తప్పదన్నారు.
వాయనాడ్
స్థానం నుంచి ఎన్డీయే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతలకు లోక్సభకు పోటీ చేసే ధైర్యం లేక రాజ్యసభకు పోతున్నారని
వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన
తప్పులు సరి చేసేందుకే పదేళ్ళు పట్టిందన్నారు. అవినీతి,
అక్రమాలను కాపాడుకోవటానికి ప్రతిపక్షాలు గుంపుగా ఏర్పడ్డాయని దుయ్యబట్టారు.
రైతులు, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ అడ్డుపడుతోందని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.