గుంటూరు కారం తరహాలోనే అక్కడ రాజకీయాలు కూడా ఎంతో హాట్. గుంటూరు సిటీలో రెండు అసెంబ్లీ సీట్లకు వైసీపీ, కూటమి అభ్యర్థులు పోటీపడుతున్నారు. గుంటూరు 2 వైసీపీ అభ్యర్థిగా మంత్రి విడదల రజని పోటీలో ఉన్నారు. ఆమె 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గెలిచి మంత్రి అయ్యారు. అయితే అక్కడ ఆమెకు వ్యతిరేకవర్గం తయారు కావడంతో, గుంటూరు 2 అసెంబ్లీ సీటు కేటాయించారు.
గుంటూరు 2లో మొదటి నుంచి టీడీపీ బలంగా ఉంది. 2014లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 4 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో టీడీపీ అభ్యర్థి మద్దాలగిరి వైసీపీ అభ్యర్థి యేసురత్నంపై 18 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్కడ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ 35 ఓట్లు తెచ్చుకున్నా టీడీపీ జెండా ఎగిరింది. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా గల్లా మాధవిని తెరమీదకు వచ్చారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు గల్లా మాధవి పెద్దగా పరిచయం లేని వ్యక్తి అని చెప్పుకోవచ్చు.
కుల సమీకరణాల్లో భాగంగా రజక సామాజికవర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థి విడదల రజనిపై, మరో రజక కులానికి చెందిన గల్లా మాధవిని రంగంలోకి దింపారు. వికాస్ హాస్పటల్స్ డైరెక్టర్గా కొద్ది మందికి పరిచయం ఉన్నా, రాజకీయాలకు మాత్రం మాధవి కొత్తేనని చెప్పాలి. గుంటూరు నగరంలో టీడీపీకి మద్దతుగా ఉన్న కమ్మ సామాజికవర్గం ఓట్లు, ఇక బీసీల బలంతో గల్లా మాధవి ప్రచారంలో దూసుకెళుతున్నారు. జనసేన బలం కూడా తోడు కావడంతో గుంటూరు 2లో టీడీపీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ పండితులు చెబుతున్నారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్