కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ
వాద్రా అనుచరుడు, ఏఐసీసీలో కీలక నేతగా ఉన్న తజీందర్ బీజేపీలో చేరారు. కాంగ్రెస్
పార్టీకి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి అశ్వినీ
వైష్ణవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో
తీవ్ర చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా
పనిచేస్తున్న తజీందర్ సింగ్ బిట్టూ, హిమాచల్ ప్రదేశ్ లో ఏఐసీసీ సెక్రెటరీ ఇన్ఛార్జీగా
వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకి ప్రధాన
అనుచరుడిగా తజీందర్ కు పేరుంది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన తజీందర్,
తన రాజీనామాను తక్షణం ఆమోదించాలని కోరారు.
ఉదయం కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తజీందర్
సింగ్ బిట్టూ మధ్యాహ్నం బీజేపీ లో చేరారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, బీజేపీ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్డే సమక్షంలో బీజేపీ కండువా
మెడలో వేసుకున్నారు.