ప్రధాని మోదీ పాలనలో జమ్ముకశ్మీర్‌లో
రాయి విసిరే సాహసం ఎవరూ చేయలేరని ఏ
ఒక్కరికీ ఆ దమ్ము లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న అమిత్ షా… ఆర్టికల్ 370 రద్దు
సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పీపుల్స్ డెమోక్రటిక్ చీఫ్ మెహబూబా చేసిన
వ్యాఖ్యలను ప్రస్తావించారు.
కశ్మీర్
లో ఆర్టికల్
370ని తొలగిస్తే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారని గుర్తు
చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి
చెందుతుందన్నారు.
రక్తపాతం
కాదు కదా, కనీసం రాయి వేసే ధైర్యం కూడా ఎవరూ చేయలేరని అమిత్ షా అన్నారు.
లోక్‌సభ
ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందన్న అమిత్ షా, రాజస్థాన్ లోని అన్ని లోక్‌సభ
స్థానాల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.